లోకేష్ పీఆర్ స్టంట్ బయటపడింది
రాష్ట్ర విద్యా వ్యవస్థపై గొప్పగా మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదివించడం లేదో సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు భిన్నంగా ఉందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాల విషయంలో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై, ప్రస్తుతం ఒక్క పట్టా కూడా ఇవ్వలేకపోయినందుకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.