నిబంధనలకు విరుద్ధంగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నియామకం
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని అధికారిని నియమించారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నందన్ను ఎఫ్ఏసీ ఇన్చార్జి కమిషనర్‌గా కొనసాగిస్తున్నారని, కార్పొరేషన్ బడ్జెట్‌ను అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇసుక, గ్రావెల్, అక్రమ మద్యం వంటి అంశాల్లో మాఫియాలు ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.