‘స్థానిక’ ఎన్నికలకు వైఎస్సార్సీపీ మైనారిటీల సన్నద్ధం
కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ మైనారిటీ విభాగం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రతి డివిజన్లో పార్టీని బలోపేతం చేయాలని నాయకులు సూచించారు. మైనారిటీ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

Comments 0
No comments yet. Be the first.