హైకోర్టు తీర్పు ఉన్నా రైతు పొలంలో రోడ్డేసి వైయస్సార్ సీపీపై దుష్ప్రచారమా?
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రం గ్రామంలో రైతుల భూముల మీదుగా రోడ్డు నిర్మాణం చేయడం వివాదాస్పదమైంది. తమ భూముల్లో అనుమతి లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారని కాశిరెడ్డి సుబ్బ నరసమ్మ, ముద్ద సుజయ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 3, 2026న జరిగిన విచారణలో గ్రావెల్ రోడ్డు నిర్మించే ప్రతిపాదన లేదని గ్రామ పంచాయతీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే, కోర్టుకు ఇచ్చిన వివరణకు విరుద్ధంగా రోడ్డు నిర్మించారని బాధితులు మండిపడుతున్నారు.

Comments 0
No comments yet. Be the first.