కుప్పంలో టీడీపీ దౌర్జన్యం.. వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్!
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి విజయ్ కుమార్ ను టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేశాయని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్సీ భరత్ నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని, మున్సిపల్ కార్యాలయం వద్ద వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు మోహరించారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. 11, 20వ వార్డు అభ్యర్థులపై దాడి జరిగి వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది.

Comments 0
No comments yet. Be the first.