స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. బలమైన అభ్యర్థులను పోటీకి దూరం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు.

Comments 0
No comments yet. Be the first.