పసుపల్లిలో 'గడప గడపకు వైయస్ఆర్సీపీ'
పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 'గడప గడపకు వైయస్ఆర్సీపీ' కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని, 2029లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments 0
No comments yet. Be the first.