Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

కమీషన్ ఇవ్వకపోతే.. సెంటర్లు వదిలి వెళ్ళిపోండి!

Print Download PDF
కమీషన్ ఇవ్వకపోతే.. సెంటర్లు వదిలి వెళ్ళిపోండి!

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) నిర్వాహకులకు రూ.40 కోట్ల బకాయిల విడుదలకు 6 శాతం కమీషన్ ఇవ్వాలని ఓ అమాత్యుని అనుచరుడు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కమీషన్ ఇవ్వకపోతే సెంటర్లను వదిలి వెళ్లిపోవాలని, వాటిని తమకు తెలిసిన వారికి ఇచ్చి నడిపించుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. బకాయిల విడుదలకు సంబంధించి రవాణా శాఖ కమిషనరేట్లో జేటీసీని కలిసినప్పుడు ఆయన మాట్లాడిన తీరుపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.