ప్రొద్దుటూరులో పచ్చచేతెల అరాచకం
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు, అల్లరి మూకలు లాక్కొని చించివేశారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. పోలీసుల లాఠీచార్జీలో రాజశేఖర్ అనే కార్యకర్తకు కంటి వద్ద తీవ్ర గాయమైంది. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి కార్యాలయం ఎదుట బైఠాయించారు.

Comments 0
No comments yet. Be the first.