నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదు
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ నేతలు నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. నామినేషన్లకు అడ్డంకులు సృష్టించడం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోతే తిరగబడతామని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

Comments 0
No comments yet. Be the first.