కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్లో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 'గడప గడపకు వైయస్ఆర్సీపీ' కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పెన్షన్ల విషయంలో డ్రామాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెట్టుబడులు మరియు ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments 0
No comments yet. Be the first.