గ్యాస్ సిలిండర్ పేలుడు బాధితురాలికి ఎమ్మెల్యే విరుపాక్షి పరామర్శ
కర్నూలులోని చిప్పగిరి గ్రామానికి చెందిన పిల్లెలి కదిరమ్మ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడి అమీలియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి, ఆయన సోదరుడు బుసినె శ్రీరాములు ఆమెను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments 0
No comments yet. Be the first.