ఆక్వా ఫీడ్ పై భారం హేయం
ఆక్వా ఫీడ్ ధరలు టన్నుకు రూ.11 వేలు పెంచడం హేయమని తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త వడ్డీ రఘురాం మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఉద్దేశపూర్వకంగా సంక్షోభంలోకి నెడుతోందని, చిన్న రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆరోపించారు. అప్సడా చట్టం 2020ని నీరుగార్చేలా జీఓ నెం:180 తీసుకువచ్చారని, త్వరలోనే ఐక్య వేదికను ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు.

Comments 0
No comments yet. Be the first.