ప్రొటెక్షన్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలి
గుంజునేరు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 40 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతినగర్ బ్రిడ్జి నుండి నరసరాంపేట పాత కోర్టు వరకు పనుల పురోగతిని, నాణ్యతను ఆయన పరిశీలించారు.

Comments 0
No comments yet. Be the first.