అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సాయం
తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండుప్రోలు గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన కొండేపూరి సుశీల కుటుంబాన్ని వైయస్ఆర్సీపీ ఇన్ఛార్జి వడ్డి రఘురామ్ నాయుడు పరామర్శించారు. ప్రమాదంలో కాలిపోయిన ఇంటిని పరిశీలించిన ఆయన, బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.

Comments 0
No comments yet. Be the first.