రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగూరు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగేల్ల రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో పర్యటించిన ఎంపీ బాధిత కుటుంబాల పరిస్థితులను తెలుసుకుని, వారు ధైర్యంగా ఉండాలని సూచించారు.

Comments 0
No comments yet. Be the first.