ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో దర్గాను తొలగించవద్దు..
మంగళగిరిలో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ హజరత్ సయ్యద్ మాలిక్ హుస్సేన్ ఔలియా దర్గాను ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తొలగించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ వైయస్ఆర్సీపీ నేతలు గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పురాతన దర్గాను పరిరక్షిస్తూ సమస్యకు పరిష్కారం చూపాలని వైయస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా విజ్ఞప్తి చేశారు.

Comments 0
No comments yet. Be the first.