ఏయూలో దోపిడీకి కూటమి భారీ ప్లాన్
ఆంధ్రా యూనివర్సిటీలో నిర్మాణ పనుల అంచనాలను రూ.95 కోట్ల నుండి రూ.210 కోట్లకు పెంచడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని పక్కనబెట్టి పనులను ఏపీఈడబ్ల్యూఐడీసీకి కట్టబెట్టడంపై విచారణ కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. శతాబ్ది ఉత్సవాల కోసం ప్రకటించిన రూ.500 కోట్ల నిధులు విడుదల కాకపోవడమే కాకుండా, వర్సిటీకి చెందిన రూ.300 కోట్ల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు మళ్లించారని ఆయన విమర్శించారు.

Comments 0
No comments yet. Be the first.