స్థానిక ఎన్నికల వేళ వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ!
రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణా, వైఎస్సార్ కడప, నెల్లూరు, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్సీపీలో చేరారు. గన్నవరంలో 100 మంది, ప్రొద్దుటూరులో 40 కుటుంబాలు, సర్వేపల్లిలో 50 కుటుంబాలు, డంగభద్రలో 30 కుటుంబాలు, కుప్పంలో 12 కుటుంబాలు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మరియు పార్టీ ఇన్చార్జిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Comments 0
No comments yet. Be the first.