పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలి
దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు పెరుగుగూడెం గ్రామంలో వైయస్ఆర్సీపీ వివిధ కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులకు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వైయస్ఆర్సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

Comments 0
No comments yet. Be the first.