కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు
వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోని మరియాపురం 40వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడమే వైయస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments 0
No comments yet. Be the first.