రవిచంద్రను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రను మాజీ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు అంజిరెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు. డీఎస్సీ అభ్యర్థుల తరఫున పోరాడినందుకు రవిచంద్రను జైలుకు పంపారని జోగి రమేష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రతిభ ఆధారంగా కాకుండా ప్యాకేజీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చిందని, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెడుతున్నారని అంజిరెడ్డి విమర్శించారు.