కూటమి పాలనలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతున్నా కూటమి ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల విమర్శించారు. వంద రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పిన హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.