స్థానిక ఎన్నికల్లో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అనుబంధ విభాగాలు సమన్వయంతో పనిచేసి పార్టీ శక్తిని గ్రామస్థాయి వరకు వినియోగించుకోవాలని రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజా సమస్యలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. పార్టీ సంస్థాగత వ్యవస్థలో ఉన్న 14 లక్షల మంది శక్తిని వినియోగించుకోవాలని ఆలూరు సాంబశివారెడ్డి, అనుబంధ విభాగాలు ప్రధాన పాత్ర పోషించాలని లేళ్ల అప్పిరెడ్డి, మహిళా సమస్యలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకెళ్లాలని వరుదు కళ్యాణి పేర్కొన్నారు.

Comments 0
No comments yet. Be the first.